News August 24, 2024

నెల్లూరు జైలు సూపరింటెండెంట్ బదిలీ

image

చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావు కడప సెంట్రల్ జైలుకు బదిలీ అయ్యారు. నెల్లూరు ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్‌గా ఉన్న రాజారావుకు స్థానిక సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ బాధ్యతలు అప్పగించారు. అలాగే కడప సెంట్రల్ జైల్ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రకాశ్‌ను ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్‌గా నియమిస్తూ జైళ్ల శాఖ డీఐజీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News March 22, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య (60) శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో చెట్లెక్కి కల్లు తీశాడు. అనంతరం అలసిపోయి చెట్ల కింద సేదతీరుదామని దగ్గరలోని తాటి పీచు తెచ్చుకున్నాడు. చెట్టు కింద కూర్చున్న సమయంలో తాటిపీచులో ఉన్న రక్తపింజరి పాము కాటు వేసింది. పొదలకూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.

News March 22, 2026

నెల్లూరు: కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

ఇందుకూరుపేట(M) డేవిస్‌పేట యాగర్ల బ్రిడ్జి వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. మైపాడు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు యువకులు ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తరుచూ ఈ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వారు వాపోయారు.

News March 22, 2026

నెల్లూరు: సెలవుల్లో పిల్లలు జాగ్రత్త.!

image

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో పిల్లలు చెరువులు, కాలువలు, సముద్ర తీరాలకు ఈతకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రమాదాల జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.