News August 24, 2024
HYD: హైవేలపై నడక మార్గాలను పెంచాలి: మంత్రి పొన్నం
జాతీయ రహదారులపై రద్దీగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల నడక మార్గాల సంఖ్యను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై శుక్రవారం హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
Similar News
News November 26, 2024
గాంధీ భవన్లో ఇంటలెక్చవల్ కమిటీ సమావేశం
నాంపల్లిలోని గాంధీ భవన్లో టీపీసీసీ ఇంటలెక్చవల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితర నాయకులు ఉన్నారు.
News November 26, 2024
సిటీలో ఎటు చూసినా యాపిల్ పండ్లే
కొద్దిరోజులుగా నగరంలో యాపిల్స్ ధరలు బాగా తగ్గిపోయాయి. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ నుంచి HYDకు ఇటీవల వీటి దిగుమతులు బాగా పెరిగాయి. మంచి క్వాలిటీ ఉన్న పండ్లు డజన్ రూ.180కే లభిస్తున్నాయి. బాటసింగారం, MJ మార్కెట్‌తో పాటు బోయిన్పల్లి మార్కెట్‌కు రోజూ అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఈ పరిస్థితి జనవరి నెలాఖరు వరకు ఉంటుందని బాటసింగారం మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు.
News November 26, 2024
రాజ్యాంగ దినోత్సవం: సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన సీఎస్
భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం డా.బీ. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సెక్రటేరియట్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతనం రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట్రావు, పలువురు అదనపు కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.