News August 24, 2024
వెంకటాచలం: పోలీసులను ఢీ కొట్టిన వాహనం

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు పోలీసులను ఓ వాహనం ఢీకొట్టింది. గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ ఆదేశాలతో నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు వాహనాలు చెక్ చేశారు. ఈక్రమంలో వేగంగా వచ్చిన ఓ వాహనం పోలీసులను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీఎస్పీ శ్రీనివాసరావు గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News July 5, 2025
నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

వరికుంటపాడు హైవేపై శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో దుత్తలూరు (M) కొత్తపేటకు చెందిన బర్రె రవి, తాళ్లూరి కృపానందం గాయపడ్డారు. తాళ్లూరి కృపానందం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ అదుపు తప్పిందా లేక గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా అనే విషయంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
News July 5, 2025
బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగ సందడి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి ముందుగానే ప్రారంభమైంది. శుక్రవారం స్వర్ణాల చెరువు వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. జులై 6 నుంచి 10 తేదీ వరకు ఐదు రోజులపాటు రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు.