News August 24, 2024

HYD: అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలని విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జ్ ప్రొ. సుధారాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 చివరి తేదీ అని వెల్లడించారు. వివరాలకు మొబైల్: 7382929570 580, 040-23680222/333/444/555, 18005 990101 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. SHARE IT

Similar News

News March 11, 2026

HYD: తక్షణమే సిలిండర్ డెలివరీ.. CP వార్నింగ్

image

వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని CP సజ్జనార్ తెలిపారు. తక్షణమే సిలిండర్ డెలివరీ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ SMలో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని CP హెచ్చరించారు.
SHARE IT

News March 11, 2026

డ్రగ్స్ నెట్‌వర్క్‌కు ‘ఈగిల్’ షాక్.. ఏఐతో నేరగాళ్ల గుట్టు రట్టు!

image

ఇక డ్రగ్స్ మాఫియా ఆటలు సాగవు..! గంజాయి, డ్రగ్స్ దందా చేసే కేటుగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. నేరగాళ్ల ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను సెకన్లలో చిదిమేసేందుకు అత్యాధునిక ‘ఏఐ డిజిటల్ ఫోరెన్సిక్’ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్ చాట్లు, సోషల్ మీడియా గుట్టును విప్పడమే కాకుండా.. AIతో అనుమానిత సంభాషణలను ఇట్టే పట్టేస్తుంది.

News March 11, 2026

నెక్లెస్ రోడ్‌ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

image

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.