News August 24, 2024
HYD: అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్
డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలని విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ప్రొ. సుధారాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 చివరి తేదీ అని వెల్లడించారు. వివరాలకు మొబైల్: 7382929570 580, 040-23680222/333/444/555, 18005 990101 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. SHARE IT
Similar News
News January 15, 2025
HYD: అప్పటి PV సింధు ఎలా ఉన్నారో చూశారా..?
ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అందరికీ సూపరిచితమే. ఆమె తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్ల జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ఫొటోను Xలోప్రముఖ ఎడిటర్ ట్వీట్ చేశారు. మొట్ట మొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఆమె నివాసంలో దిగిన ఫోటో ఇది. నేడు దేశానికి ఎన్నో విజయాలు సాధించి, గొప్ప పేరు తెచ్చారని పలువురు ప్రశంసించారు.
News January 15, 2025
HYD: పేరుకే చైనా మాంజా.. తయారీ ఇక్కడే..!
చైనీస్ మాంజా అందుబాటులో ఉండడానికి అసలైన కారణం మన ప్రాంతాల్లోనే తయారు చేస్తున్నట్లు HYD సీపీ ఆనంద్ తెలిపారు. ఈ-కామర్స్ ద్వారా ఎవరైనా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కామర్స్ గోదాములపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉందని Xలో ట్వీట్ చేశారు. నగరంలో భారీ మొత్తంలో చైనా మాంజాను పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు.
News January 15, 2025
ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.