News August 24, 2024
నెల్లూరు జైలు వద్ద టెన్షన్.. టెన్షన్

EVM ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు జైలులో ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. సంబంధిత కాపీలు జైలుకు అందకపోవడంతో ఆయన నిన్న విడుదల కాలేదు. మరికాసేపట్లో ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అనిల్, కాకాణి జైలు వద్దకు చేరుకున్నారు. బయటకు వచ్చే పిన్నెల్లిని మరో కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది.
Similar News
News March 22, 2026
నెల్లూరులో దారుణ హత్య.. మృతుడి వివరాలు ఇవే!

నెల్లూరు బోడిగాడి తోటలోని శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి<<19446783>> దారుణ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. నవాబ్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వీర్ క్రాంత్ అని, వలస కూలీ అని చెబుతున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సిమ్ కార్డ్ ఆధారంగా వివరాలు తెలిసినట్టు సమాచారం.
News March 22, 2026
నెల్లూరు నగరంలో దారుణ హత్య!

నెల్లూరు నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య జరిగినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని ఈ హత్య చేసి కాల్చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య (60) శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో చెట్లెక్కి కల్లు తీశాడు. అనంతరం అలసిపోయి చెట్ల కింద సేదతీరుదామని దగ్గరలోని తాటి పీచు తెచ్చుకున్నాడు. చెట్టు కింద కూర్చున్న సమయంలో తాటిపీచులో ఉన్న రక్తపింజరి పాము కాటు వేసింది. పొదలకూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.


