News August 24, 2024

గ్రేటర్ HYDలో బస్తీ ప్రాంతాలకు బస్సులు కరవు!

image

గ్రేటర్ HYDలో వందల సంఖ్యలో ఉన్న కాలనీలు, బస్తీలకు తగినన్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. ఫలితంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలు, బస్తీలకు సెట్విన్ తరహాలో మినీ బస్సులు నడిపితే ప్రయోజనం ఉంటుందనే గతంలో నిపుణులు సూచించినా ఆ దిశగా ఇప్పటి వరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. మీ కామెంట్?

Similar News

News February 20, 2026

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

image

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.

News February 20, 2026

HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

image

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.