News August 24, 2024

సీన్లు లీక్ అవడంపై న‌టి ఆవేద‌న‌

image

‘ఆగ్రా’ చిత్రంలోని కొన్ని సీన్లను వైరల్ చేయడంపై నటి రుహాని శర్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘కళాత్మక సినిమాలు తీయడం సవాళ్లతో కూడుకున్న పని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. మా బాధను అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ మూవీని ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్ చేశారు’ అని తెలిపారు. కాగా కొన్ని సీన్లను వైరల్ చేసి అవి రుహాని ప్రైవేట్ వీడియోలంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు.

Similar News

News March 22, 2026

IPL 2026 తర్వాత ధోనీ గుడ్ బై: ఉతప్ప

image

IPL 2026 తర్వాత ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప హింట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ కేవలం ఫినిషర్‌గా కాకుండా ‘మెంటార్ కమ్ ప్లేయర్’గా కనిపిస్తారని తెలిపారు. తన రిటైర్మెంట్ కోసం సిద్ధమవుతున్న ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానానికి పడిపోయే అవకాశం ఉందని, దీనివల్ల రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ మరింత మెరుగుపడుతుందని ఉతప్ప అభిప్రాయపడ్డారు.

News March 22, 2026

రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?

image

TG: CM హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సిద్దిపేటకు వస్తుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. నియోజకవర్గానికి రావాల్సిన ₹1,000 కోట్ల నిధులు ఆగిపోయాయంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రుణమాఫీ కాని రైతులతో కలిసి నిరసన తెలుపుతామని హరీశ్ ప్రకటించడంతో ఆదివారం పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.

News March 22, 2026

UAEపై ఇరాన్ డ్రోన్ల వర్షం.. అసలు ప్లాన్ ఇదే!

image

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు UAEని మంటల్లోకి నెట్టింది. 2025లో ట్రంప్ ప్రభుత్వం అందుకున్న $5.2 ట్రిలియన్ల పెట్టుబడుల్లో సింహభాగం (27%) UAE నుంచే వచ్చాయి. అందుకే ఆ దేశంపై దాడులు చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇరాన్ పరోక్షంగా దెబ్బతీస్తోంది. ప్రపంచ పెట్టుబడుల హబ్‌గా ఎదిగిన దుబాయ్ స్థిరత్వాన్ని దెబ్బతీసి గల్ఫ్ దేశాలపై నమ్మకం పోయేలా చేయడం ఇరాన్ వ్యూహం.