News August 24, 2024
ఖమ్మం: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి

ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు వాయిదా పడతాయని భావిస్తున్న తరుణంలో పంచాయతీ ఓటర్ల ముసాయిదా షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ మద్దతుదారులతో పాటు వనరుల సమీకరణలో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లోని 5389 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
Similar News
News March 8, 2026
ఖమ్మం: భారీగా యూరియా రాక

చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శనివారం 2,670.84 మెట్రిక్ టన్నుల ఇఫ్కో యూరియా చేరుకుంది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,070.84 టన్నులు, భద్రాద్రికి 500, మహబూబాబాద్‌కు 900, ఖమ్మం సీఆర్పీకి 200 టన్నుల యూరియా కేటాయించినట్లు టెక్నికల్ ఏవో పవన్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News March 8, 2026
వెలుగుమట్ల భూ వివాదంలో 19 కేసులు నమోదు: డీసీపీ

ఖమ్మం వెలుగుమట్ల భూ వివాదంలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైనట్లు అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్ రావు తెలిపారు. UCCRL (ML) OPDR భూదాన్ కమిటీ సభ్యుల ముసుగులో పేద బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి వారిని మోసం చేశారని అన్నారు. దర్యాప్తులో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9మందిని అరెస్టు చేశామన్నారు.
News March 7, 2026
విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.


