News August 24, 2024
లింగాల: బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు కోసం ప్రతిభ గల బాల, బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS) అధికారులు తెలిపారు. ధైర్య సాహసాలు ,క్రీడలు, పర్యావరణం కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సేవా రంగాలలో ప్రావీణ్యం కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయసు గల బాల, బాలికలు ఆగస్టు 31 తేదీ వరకు http.s://awrds.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
Similar News
News March 10, 2026
హెచ్‌సీఏ సెక్రటరీగా పాలమూరు వాసి నియామకం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెక్రటరీగా పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.
News March 10, 2026
MBNR: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం – కలెక్టర్

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.
News March 9, 2026
MBNR: డిగ్రీ.. దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌లోని(దొడ్డలోనిపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నూతన ఏడాదికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నేరుగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


