News August 24, 2024
గ్రాడ్యుయేషన్ డేకి ఆ డ్రెస్ కోడ్ ఇక బంద్

వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేకి ఇక నుంచి నల్లటికోటు, టోపీ ధరించే సంస్కృతికి స్వస్తిపలకాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, ఎయిమ్స్, ఇతర ప్రముఖ సంస్థలకు ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. బ్రిటిష్ పాలన నుంచి ఈ విధానం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రాల్లోని స్థానిక సంప్రదాయాల ఆధారంగా డ్రెస్ కోడ్ రూపొందించాలని నిర్దేశించింది.
Similar News
News March 11, 2026
ఎక్కడా గ్యాస్ కొరత లేదు: చంద్రబాబు

AP: స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని CM చంద్రబాబు సూచించారు. ‘ప్రస్తుతం కొరత లేదు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. గ్యాస్, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
News March 11, 2026
అకౌంట్లలోకి డబ్బులు.. ఇలా చేయండి

ఎల్లుండి(ఈ నెల 13న) రైతుల <<19350621>>ఖాతాల్లో<<>> పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. అయితే అర్హులైన అన్నదాతలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. పీఎం కిసాన్ <
News March 11, 2026
చిన్నస్వామి నుంచే IPL కిక్ స్టార్ట్

గతేడాది తొక్కిసలాట తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఇప్పుడు IPL-2026 అక్కడి నుంచే కిక్ <<19356627>>స్టార్ట్<<>> కానుండటం గమనార్హం. తొలి మ్యాచ్‌లో RCB-SRH తలపడనున్నాయి. ఇది ఒక రకంగా RCB అభిమానులకు శుభవార్తే. నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఫ్యాన్స్ కూడా హద్దులు దాటకుండా ఆటను ఆస్వాదించాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.


