News August 24, 2024

కోర్టు వ్యతిరేక తీర్పుఇస్తే నేనే కూల్చేసేవాడిని: నాగార్జున

image

N కన్వెన్షన్ కూల్చివేస్తున్నట్లు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం <<13930620>>సరికాదని<<>> హీరో నాగార్జున పేర్కొన్నారు. కోర్టు వ్యతిరేకంగా తీర్పుఇస్తే తానే కూల్చివేసేవాడినన్నారు. ‘తాజా పరిణామాలతో మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చు. వారి అభిప్రాయాన్ని పోగొట్టేందుకు కోర్టును ఆశ్రయిస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News March 18, 2026

చైనాకు వెళ్లాల్సిన రష్యా ఆయిల్ నౌకలు భారత్‌కు!

image

రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను భారత్ డబుల్ చేసింది. ఎంతలా అంటే చైనాకు వెళ్లే ఆయిల్ షిప్పులను మళ్లించి భారత్‌కు పంపించేంతలా! ఆగ్నేయ ఆసియా నుంచి ఆక్వా టైటాన్ MAR 21న కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరనుంది. భారత్ ఒక వారంలో రష్యా నుంచి 30 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. మొత్తం ఏడు నౌకలను చైనా నుంచి ఇండియాకు రష్యా డైవర్ట్ అయ్యాయి. కాగా రష్యా $98కు బ్యారెల్‌ చొప్పున ఆయిల్ అందిస్తోంది.

News March 18, 2026

రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటలు బయటకు రావొద్దు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో ప.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 18, 2026

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. వేల సంఖ్యలో తరలివస్తున్న కన్నడిగులు

image

AP: ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి కన్నడ భక్తులు పోటెత్తుతున్నారు. నల్లమల అడవుల్లో వందలాది కి.మీ నడుచుకుంటూ క్షేత్రానికి చేరుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచీ భక్తులు వస్తుండటం విశేషం. వీరంతా కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న మొక్కులు తీర్చుకుంటున్నారు. 3 రోజుల్లోనే 2 లక్షల మంది స్వామిని దర్శించుకోవడం గమనార్హం. ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి.