News August 24, 2024

నేడు హౌరా-ఎర్నాకులం ట్రైన్ రీ షెడ్యూల్

image

శనివారం హౌరాలో బయలుదేరే రైలు (22877) హౌరా-ఎర్నాకులం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ 4:10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనుంది. మధ్యాహ్నం 14:50 గంటలకు బదులుగా 19:00 గంటలకు హౌరాలోని బయలుదేరుతుంది. భువనేశ్వర్, విజయనగరం మీదుగా దువ్వాడ స్టేషన్‌కు రేపు ఉదయం 9:05 చేరనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

Similar News

News March 21, 2026

విశాఖ: ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు

image

రన్నింగ్ ట్రైన్స్‌లో ల్యాప్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్.ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్‌లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్‌టాప్‌లు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన చెప్పారు.

News March 21, 2026

24న విశాఖ రానున్న రాష్ట్ర గవర్నర్

image

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 24న విశాఖ రానున్నారు. 24వ తేదీ రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకుని రాత్రికి ఒక హోటల్లో బస చేస్తారు. 25న ఉదయం10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ పయనమవుతారు. వీటికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.