News August 24, 2024
నచ్చిన రంగంలో ఇంటర్న్‌షిప్: UGC

విద్యార్థుల్లో నైపుణ్యం పెంపు, కెరీర్ వృద్ధికి ఊతమిస్తూ వారు ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకోవడానికి UGC మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి-పరిశోధన ఆధారంగా వివిధ విభాగాలను విభజించింది. విద్యార్థులు తమ కెరీర్ ఆకాంక్షల మేరకు ఏదైనా విభాగాలను ఎంపిక చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. దేశంలోని 500 ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు పెయిడ్ ఇంటర్న్‌షిప్ పొందే పథకాన్ని కేంద్రం బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది.
Similar News
News February 9, 2026
ప్రకాశం: ACB దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే.పల్లిపాలెం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సంపత్ కుమార్ లంచం తీసుకుంటూ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. సోమవారం ఆయన రూ.55 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం సంపత్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
News February 9, 2026
దూసుకెళ్తున్న భారత్.. G20 దేశాల్లో టాప్

2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ GDP వృద్ధి 6.4%గా ఉండనుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. G20 దేశాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని వెల్లడించింది. పెట్టుబడులు పెరగడం, స్థిరమైన వృద్ధి దీనికి కారణమని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు, ఆదాయపన్ను రాయితీలు కీలకమని పేర్కొంది. మరోవైపు RBI కూడా తొలి రెండు త్రైమాసికాల వృద్ధి అంచనాలను పెంచింది.
News February 9, 2026
ఏపీలో పెరుగుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు

AP: రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నట్లు పాపులేషన్ మేనేజ్‌మెంట్ సర్వేలో వెల్లడైంది. సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 14.9%, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12% కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీలు రికార్డయినట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అత్యల్పంగా విశాఖలో 3.96%గా ఉంది.


