News August 24, 2024
తిరుపతి: ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి పారామెడికల్ DP/DLMT కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను https://tirupati.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.
Similar News
News January 13, 2026
చిత్తూరు: కరెంట్ వైర్లతో జాగ్రత్త..!

సంక్రాంతి సందర్భంగా కరెంట్ వైర్లకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని చిత్తూరు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ సూచించారు. గాలిపటాలు కరెంటు వైర్ల మధ్య చిక్కుకున్నప్పుడు వాటిని తీయకూడదని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లకు దూరంగా ఎగురవేయాలని, లోహపు దారాలతో పతంగులు ఎగరవేయరాదని కోరారు. ప్రమాదాలు జరిగితే టోల్ ఫ్రీ 1912కు ఫోన్ చేయాలన్నారు.
News January 13, 2026
చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.
News January 13, 2026
చిత్తూరు: భారీగా దరఖాస్తులు

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. నాన్ టీచింగ్‌కు సంబంధించి కేజీవీబీల్లో 22, మోడల్ స్కూళ్లలో 12 ఉద్యోగాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. 32పోస్టులకు 712దరఖాస్తులు వచ్చాయి. కేజీబీవీల్లోని 22 ఉద్యోగాలకు 461 దరఖాస్తులు, మోడల్ స్కూళ్లలోని 12 ఉద్యోగాలకు 251 వచ్చాయని అధికారులు వెల్లడించారు.


