News August 24, 2024
N కన్వెన్షన్‌కు నిర్మాణ అనుమతులు లేవు: హైడ్రా కమిషనర్

TG: నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌కు GHMC నుంచి నిర్మాణ అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతుల కోసం ప్రయత్నించారని, కానీ అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. ‘తుమ్మిడికుంట చెరువులోని FTLలో 1.12 ఎకరాల్లో, బఫర్ జోన్‌లోని 2.18 ఎకరాల్లో కన్వెన్షన్ నిర్మించారు. N కన్వెన్షన్‌తో సహా అక్రమ నిర్మాణాలు కూల్చేశాం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
నంద్యాల జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే!

నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు ఉదయం 7.45 గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
News March 14, 2026
పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి గమనించండి!

పుచ్చకాయపై ఉండే మచ్చ పసుపు/నారింజ రంగులో ఉంటే పండినట్లు, తెల్లగా ఉంటే ఇంకా పండనట్లు. గుండ్రటి కాయలు తీయగా ఉంటాయి. పొడవుగా ఉండేవి తక్కువ తీపి కలిగి ఉంటాయి. ఒకే సైజులో ఉన్న వాటిలో బరువు ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. వాటిలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటాయి. కాయ కాడ పూర్తిగా ఎండిపోయి, మెరుపు తక్కువగా ఉంటే అది సహజంగా పాదుపైనే పండిందని అర్థం. గోధుమ రంగు గీతలు ఉన్న కాయలు చాలా తీయగా ఉంటాయి.
News March 14, 2026
పుతిన్ ప్రపోజల్‌కు నో చెప్పిన ట్రంప్!

ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల (60% శుద్ధి చేసిన) యురేనియంను రష్యాకు తరలించాలని పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఒక మార్గమని పుతిన్ చెప్పినట్లు తెలిపింది. ఈ యురేనియంతో సుమారు 11 అణు బాంబులను తయారు చేయవచ్చని సమాచారం. అందుకే ఈ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవాలి లేదా పనికిరాకుండా చేయాలని US ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


