News August 24, 2024

SHOCKING: తగ్గుతున్న కుటుంబ ఆదాయాలు

image

దేశంలో ఈ మధ్యన కుటుంబ వాస్తవ ఆదాయం తగ్గుతోందని SIE బ్రోకరేజ్ రిపోర్టు పేర్కొంది. రుతుపవనాలు ఆశలు రేపుతున్నా గ్రామీణ ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలంది. GDPలో 78 శాతంగా ఉన్న కుటుంబ ఆదాయం రాబోయే రోజుల్లో మెరుగవ్వొచ్చని అంచనా వేసింది. డిమాండ్ లేక వృద్ధి తగ్గిందని, రాయితీలు తగ్గించి కంపెనీలు మార్జిన్లను మెయింటేన్ చేస్తున్నాయంది. RBI చర్యలతో రిటైల్ రుణాల వృద్ధి తగ్గినట్టు తెలిపింది.

Similar News

News March 29, 2026

స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దు: మోదీ

image

గతంలో కొవిడ్, ప్రస్తుతం యుద్ధాలతో ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం తలెత్తిందని 132వ మన్‌కీబాత్‌లో తెలిపారు. ఈ సమయంలో దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా తప్పుడు ప్రచారాలు, స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని, ఐక్యంగా ఉండాలని ప్రజలకు మరోసారి సూచించారు.

News March 29, 2026

హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి: CBN

image

AP: స్థానిక సంస్థల్లో మహిళలకు ఏనాడో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘సామాన్యులను చట్టసభలకు పంపిన పార్టీ టీడీపీ. మేం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు అనేక రాష్ట్రాలకు మోడల్‌గా మారాయి. ఇక మూడు రాజధానుల మూడు ముక్కలాటలు ఉండవు. హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి మారుతుంది’ అని తెలిపారు.

News March 29, 2026

కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.. అసెంబ్లీలో డిమాండ్!

image

TG: అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు ఆరోపించారు. కడియం మాట్లాడుతుండగా కౌశిక్ గన్‌తో కాల్చి పడేస్తానంటూ చేయితో సైగలు చేశారని మండిపడ్డారు. ఆయన్ను ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బీఆర్ఎస్ అగౌరవంగా వ్యవహరిస్తోందని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.