News August 24, 2024
హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది: కిషన్ రెడ్డి

TG: N కన్వెన్షన్ కూల్చివేతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది. గతంలో అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారు? అక్రమ నిర్మాణాలకు రోడ్లు ఎందుకు వేశారు? ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి. అనుమతులు ఇచ్చినవారిపైనా చర్యలు తీసుకోవాలి’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Similar News
News March 4, 2026
ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్‌లో 10.93 రన్ రేట్‌తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్‌క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.
News March 4, 2026
మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్ షాకు సీఎం రిపోర్ట్

ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం నివేదిక ఇచ్చారు. ఆపరేషన్ కగార్‌కు తెలంగాణ పోలీసులు సహకరించారని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని షా కోరారు. తెలంగాణలో ఈగల్ టీమ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు గురించి రేవంత్ వివరించారు. రాష్ట్రానికి IPS క్యాడర్‌ను పెంచాలని కోరారు.
News March 4, 2026
రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ చేసింది. వీరు రేపు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారుగా ఉన్నారు.


