News August 24, 2024
పాల్వంచ: లారీని ఢీకొన్న కారు.. పలువురికి తీవ్ర గాయాలు

పాల్వంచ నవభారత్ మైనింగ్ కళాశాల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముందు వెళ్తున్న ఓ లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 3, 2026
ఖమ్మం బస్టాండ్‌లో బాదుడు.. నిబంధనలకు పాతర!

ఖమ్మం నూతన బస్ స్టేషన్‌లో తినుబండారాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్న స్టాళ్లలో ఎంఆర్‌పీ నిబంధనలను గాలికి వదిలేసి, స్నాక్స్, వాటర్ బాటిళ్లను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. అధిక ధరలపై ప్రయాణికులు ప్రశ్నిస్తే నిర్వాహకులు దురుసుగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి, తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు కళ్లెం వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
News January 3, 2026
ఖమ్మం ఆయుర్వేద ఆసుపత్రిలో మందులు నిల్!

ఖమ్మం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మందుల కొరతతో వెలవెలబోతోంది. మూడు నెలలుగా ఇక్కడ మందులు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే రోగులు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. వైద్యులు పరీక్షించి చీటీలు రాసిస్తున్నా, మందుల కౌంటర్‌లో నిల్వలు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
News January 3, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: అదనపు కలెక్టర్

రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ శ్రీజ జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.


