News August 24, 2024
HYD: రూ.1.15 కోట్ల చెక్కు అందజేత

ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్‌షాక్‌తో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబసభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బాగ్ లింగంపల్లిలో అందజేశారు. కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 4, 2026
నియోపోలిస్ భూమి ‘యూ-టర్న్’.. సర్కారు వెనకడుగు!

కోకాపేటలో రిజర్వాయర్ల కోసం కేటాయించిన 3.95 ఎకరాల విషయంలో సర్కారు అడ్డంగా దొరికిపోయింది. శారదా పీఠం భూములను HMWSSBకి ఇస్తూ FEB 28న GO ఇచ్చారు. పీఠం రిప్రజెంట్లు CMను కలవడంతో ఆ భూ కేటాయింపు రద్దయింది. 592మీటర్ల ఎత్తు నుంచి సప్లై చేస్తేనే పాతబస్తీ, మెహదీపట్నంకు కరెంట్ ఖర్చు లేకుండా నీళ్లు వెళ్తాయి. ఇప్పుడు ఆ స్థలం పోవడంతో ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.వందల కోట్లు పెరుగుతుందన్నది గ్రౌండ్ రిపోర్ట్.
News March 4, 2026
HYD: మెట్రో హంగులకు ఇక గుడ్-బై!

L&T చేతిలో ఉన్న HYD మెట్రో ఫేజ్-1 ఇక పక్కా ప్రభుత్వ ఆస్తి కాబోతోంది. MAR 31 నాటికి అప్పగింత పూర్తి కావాల్సిందేనని CS నుంచి డెడ్ లైన్ వచ్చింది. సుమారు రూ.15,000 కోట్ల భారీ డీల్ ఇది. ఈ డబ్బు కోసం ప్రభుత్వం ఇప్పుడు IRFC దగ్గర తక్కువ వడ్డీకి అప్పు కోసం తిరుగుతోంది. ప్రభుత్వ మెట్రోలో సామాన్యుడికి టికెట్ ధరలు తగ్గుతాయా?, కనీస మెయింటెనెన్స్ లేక మెట్రో ‘ఆర్టీసీ’లా మారుతుందా? అని జనం టెన్షన్ పడుతున్నారు.
News March 4, 2026
3 ముక్కల HYD.. ‘గ్రేటర్’ కథ కంచికే!

FEB 10తో GHMC కౌన్సిల్ పదవీకాలం ముగియడమే ఆలస్యం.. సర్కారు సిటీని 3 ముక్కలు చేస్తూ GO నం. 55 ఇచ్చేసింది. ఈ ముక్కలాట వెనుక అసలు కిటుకు వార్డుల పునర్విభజన. పాతబస్తీ పట్టు తగ్గించి కొత్త ఏరియాల్లో పొలిటికల్ పవర్ మార్చడమే అసలు ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏటా రూ.2,000 కోట్ల ట్యాక్స్ కట్టే IT ఏరియా CYB కిందకి వెళ్లడంతో GHMC డెవలప్‌మెంట్ కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారో? అన్నది సవాల్‌గా మారింది.


