News August 24, 2024

ప.గో: స్కూటీని ఢీకొన్న లారీ.. టీచర్ దుర్మరణం

image

కొవ్వూరు మండలం దేచెర్ల చెరువు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దేవరపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు మహిళ రాజమండ్రికి చెందిన రాజ్యలక్ష్మి (హిందీ టీచర్)గా తెలుస్తుంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

Similar News

News March 17, 2026

అలర్ట్.. ప.గో. జిల్లాలో ఉద్యోగాలు

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తణుకులో నూతనంగా ‘వన్‌ స్టాప్‌ సెంటర్’ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అధికారిణి డి.శ్రీలక్ష్మి తెలిపారు. ఇందులో అడ్మినిస్ట్రేటర్, కేస్‌ వర్కర్, కౌన్సెలర్, కంప్యూటర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు westgodavari.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 17, 2026

రెవెన్యూ క్లినిక్‌లతో భూసమస్యల పరిష్కారం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు ఉత్తమ ఫలితాలు నిస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ..29 డిసెంబర్, 2025న రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభం నాటి నుంచి మార్చి 16, 2026 వరకు 10 విడతలుగా రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 461 దరఖాస్తులు అందగా 148 పరిష్కరించామన్నారు.

News March 17, 2026

ప్రభుత్వ ఆదాయం పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడంలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. మంగళవారం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జీఎస్టీ సమన్వయ సమావేశం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ, ఇతర ఆదాయార్జన శాఖల అధికారులు పాల్గొన్న ఈ సభలో.. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఆదాయ వనరులను మెరుగుపరిచేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.