News August 24, 2024

ఖమ్మం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన డిప్యూటీ సీఎం

image

ఖమ్మం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం చర్చించారు. అలాగే పలు అంశాలపై కేంద్రమంత్రితో డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు.

Similar News

News March 4, 2026

మరణంలోనూ వెలుగులు నింపిన శ్రీవల్లి

image

ఖమ్మం ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన సోమంచి శ్రీవల్లి పుట్టుకతోనే మెదడు సంబంధిత సమస్యతో మంచానికే పరిమితమై, మంగళవారం మృతి చెందింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు చైతన్యవంతంగా ఆలోచించి, కుమార్తె నేత్రాలను ‘అన్నం ఫౌండేషన్’కు దానం చేశారు. శ్రీవల్లి కళ్లతో మరొకరికి చూపునివ్వాలన్న వారి నిర్ణయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్ అభినందించారు. ఈ దాతృత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

News March 3, 2026

రెండు గంజాయి కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష

image

ఖమ్మం: రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నిందితుడికి ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి తీర్పు చెప్పారు. పెనుబల్లి మండలానికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62) పై 2024, 2025లో వియం బంజర పోలీసుల తనిఖీలలో గంజాయితో పట్టుబడ్డాడు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

News March 3, 2026

వెలుగుమట్ల పార్కును సందర్శించిన డీఎఫ్ఓ

image

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలించారు. బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడవుల రక్షణకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.