News August 24, 2024
తూ.గో: స్కూటీని ఢీకొన్న లారీ.. టీచర్ దుర్మరణం

కొవ్వూరు మండలం దేచెర్ల చెరువు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దేవరపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు మహిళ రాజమండ్రికి చెందిన రాజ్యలక్ష్మి (హిందీ టీచర్)గా తెలుస్తుంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
Similar News
News November 3, 2025
మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News November 3, 2025
నేడు యథాతథంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని ఆమె సూచించారు. ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 2, 2025
1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల సాయం: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో 1,185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.


