News August 24, 2024
పీడీపీ మ్యానిఫెస్టో: ఆర్టికల్ 370 రద్దే ప్రధానాంశం

మహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ జమ్మూకశ్మీర్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు శ్రమిస్తామని హామీ ఇచ్చింది. భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తామంది. కశ్మీరీ పండితులను సగౌరవంగా రాష్ట్రానికి తీసుకొచ్చి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని పేర్కొంది. పీఎస్‌ఏ, దేశద్రోహం, ఎనిమీ యాక్ట్‌లను రద్దు చేయిస్తామని తెలిపింది.
Similar News
News March 15, 2026
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా?

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు, మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణంపై వాడీవేడి చర్చలకు ఆస్కారం ఉంది. సభకు KCR హాజరవడంపై క్లారిటీ లేదు. గతంలో సమావేశాల తొలి రోజున మాత్రమే BRS చీఫ్ హాజరయ్యేవారు.
News March 15, 2026
102 ఏళ్ల బామ్మ.. రోజూ మద్యం, మాంసం తీసుకుంటూ..

చక్కటి జీవనశైలితోనే ఎక్కువ కాలం జీవిస్తారనే సిద్ధాంతానికి సవాల్ విసురుతున్నారు చైనాకు చెందిన జిన్ బావోలింగ్(102). ఆమె రోజూ పంది మాంసం, కేక్స్, బ్రెడ్స్, బ్రౌన్ షుగర్‌తో కాఫీ, ఆల్కహాల్ తీసుకుంటారు. రోజుకు 15 గంటలు నిద్రపోతారు. కూరగాయలు అరుదుగా తినే బామ్మ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఆస్పత్రి మెట్లు ఎక్కలేదని కుటుంబీకులు చెప్పారు. జిన్ స్టోరీ SMలో వైరలవుతోంది.
News March 15, 2026
మార్చి 31లోపు ఈ పనులు చేయండి!

FY26 ముగిసేలోపు(మార్చి 31) పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి. లేదంటే అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. రీయాక్టివేట్ చేయడానికి ఫైన్ చెల్లించాలి.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏటా కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 జరిమానా.
* సుకన్య సమృద్ధి యోజన యాక్టివ్‌గా ఉండాలంటే ₹250 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 ఫైన్.
* నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఏటా ₹1,000 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹100 పెనాల్టీ.


