News August 24, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని 18 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలు ఇవే.. ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ.

Similar News

News March 30, 2026

పురుషుల కంటే మహిళల జీతాలే పెరిగాయి: సర్వే

image

పురుషులతో పోలిస్తే మహిళల నామినల్ వేతనాల్లో వృద్ధి ఎక్కువగా ఉందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(PLFS-2025) తెలిపింది. 3 విభాగాల(స్వయం ఉపాధి, ఉద్యోగులు, కార్మికులు) వారీగా ఈ సర్వే చేసింది. ‘స్వయం ఉపాధి చేసుకునే పురుషుల సంపాదన 6%, మహిళల ఆర్జన 8.8% పెరిగాయి. ఉద్యోగుల్లో పురుషుల జీతం 5.8%, మహిళల శాలరీ 7.2% పెరిగాయి. లేబర్ విభాగంలో పురుషుల వేతనం 0.2% తగ్గగా, మహిళల కూలీ 5.4% పెరిగింది’ అని పేర్కొంది.

News March 29, 2026

ఫోన్‌లో 100% ఛార్జింగ్ మంచిదేనా?

image

ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదని ఎక్స్‌పర్టులు హెచ్చరిస్తున్నారు. ‘100%’లో ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి ఉండటం వల్ల బ్యాటరీలపై అధిక వోల్టేజ్ ఒత్తిడి పడుతుందని అంటున్నారు. దీంతో బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుందని, 10-15 శాతం వరకు లైఫ్ పడిపోతుందని చెబుతున్నారు. 20-80% మధ్య ఛార్జింగ్ ఉంటే ఫోన్లు ఉత్తమంగా పని చేస్తాయంటున్నారు. అత్యవసర సమయాల్లో ఫుల్ ఛార్జ్‌తో వాడుకోవచ్చని సూచిస్తున్నారు.

News March 29, 2026

రేపటి మ్యాచ్‌కు విధ్వంసకర బ్యాటర్ దూరం

image

IPL: రేపు RRతో జరిగే మ్యాచ్‌కు విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ దూరమయ్యారు. ట్రైనింగ్‌లో పక్కటెముకల కండరాలు పట్టేయడంతో రేపటి మ్యాచ్ ఆడట్లేదని CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. త్వరలోనే ఫిటెనెస్ సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తొలి రెండు మ్యాచులు అనంతరం బ్రెవిస్ అందుబాటులో ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. రేపు గౌహతిలో ఈ 2 జట్ల మధ్య రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది.