News August 24, 2024
NLG: ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు పెంచండి సారూ.!

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలో గర్భిణీ ప్రసవించిన ఘటనను వార్తల్లో చూసిన సామాన్య ప్రజలు ఆస్పత్రిలో ఇకనైనా మౌలిక వసతులు వెంటనే కల్పించాలని మాత శిశు సంరక్షణ కేంద్రంలోని వార్డులు, లేబర్ రూమ్‌లో పడకలు పెంచాలని కోరుతున్నారు. చిన్న పిల్లలకు జ్వరం సిరప్ 250 ఎంజీ అందుబాటులో లేవు యాంటీ బయాటిక్ సిరప్‌లు వారి వయస్సులకు తగ్గట్టుగా లేవు, బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని సామాన్యులు అంటున్నారు.
Similar News
News September 15, 2025
మూసీకి తగ్గిన వరద

మూసీ నదికి వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 4,385.47 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అధికారులు 3 క్రస్ట్ గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.
News September 15, 2025
NLG: పాస్ ఉంటేనే అనుమతి

ఇవాళ నిర్వహించే MGU స్నాతకోత్సవానికి యూనివర్శిటీలోకి విద్యార్థితో పాటు వారి వెంట కుటుంబ సభ్యుల్లో ఒకరిని లోపలికి అనుమతించనున్నారు. వేదికపై వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే అతిథులు ఆసీనులు కావాల్సి ఉంటుంది. యూనివర్శిటీలోకి వెళ్లాలంటే వారికి ఇచ్చిన అనుమతి పత్రం (పాస్) తప్పనిసరిగా ఉండాలి. పాస్ లేకుంటే యూనివర్సిటీ లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించరు.
News September 15, 2025
NLG: నేటి గ్రీవెన్స్ డే రద్దు : ఎస్పీ

జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన దృష్ట్యా సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. తాము అందుబాటులో ఉండమని, ప్రజలు కార్యాలయానికి రావొద్దని కోరారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథావిధిగా కొనసాగుతోందని చెప్పారు.