News August 25, 2024
రికార్డు సృష్టించిన మెగాస్టార్ సినిమా

మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా USAలోనూ రీరిలీజ్ అయింది. అక్కడ ఒక్క రోజులో $62,011 వసూళ్లు సాధించింది. దీంతో రీరిలీజ్ సినిమాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆలాగే ఓవరాల్ కలెక్షన్లలో కూడా ఇదే అత్యధికమని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వెల్లడించింది.
Similar News
News March 20, 2026
అకాల వర్షాలు.. రూ.62 కోట్ల నష్టం

AP: అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాల్లో మొక్కజొన్న, వరి, మినపకు రూ.40 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 9 జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరపకు, 9 జిల్లాల్లో మామిడి, బత్తాయి, నిమ్మకు రూ.22.68 కోట్ల నష్టం(మొత్తం రూ.62.68 కోట్లు) వాటిల్లినట్లు వెల్లడించారు. రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని CBN ఆదేశించారు.
News March 20, 2026
సీక్వెల్స్‌లో మీకు నచ్చిన సినిమా ఏంటి?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. సూపర్ హిట్ అయిన చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు తీయడం పెరుగుతోంది. ఈ జాబితాలో బాహుబలి, KGF, పుష్ప, కాంతార(ప్రీక్వెల్), డీజే టిల్లు, అఖండ, కార్తికేయ, ఇస్మార్ట్ శంకర్, దృశ్యం, F2, పొన్నియన్ సెల్వన్, హిట్, పొలిమేర, మత్తు వదలరా, మ్యాడ్, తాజాగా ధురంధర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సీక్వెల్ ఏంటో కామెంట్ చేయండి.
News March 20, 2026
ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.22 పెంపు

గల్ఫ్ యుద్ధ ప్రభావంతో దేశంలో ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్‌పై రూ.22 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రూ.87.57 ఉన్న ధర రూ.109.59కి చేరింది. ఈ డీజిల్‌ను పరిశ్రమలు, రవాణా, పవర్ జనరేషన్‌లో ఉపయోగిస్తారు. ఫలితంగా ప్రొడక్షన్ కాస్ట్, రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.


