News August 25, 2024

వరంగల్ మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి: మంత్రి పొంగులేటి

image

వరంగల్ నగరాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డా.బీఆర్ అంబేడ్కరర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో ‘కూడా’ అధికారులు, పలుశాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షంచారు.

Similar News

News November 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జరిమానా
> HNK: అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
> NSPT: గంజాయి పట్టివేత
> WGL: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
> JN: గుట్కా పట్టివేత
> WGL: ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు
> MHBD: రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి!
> HNK: పరకాల పరిధిలో పోగొట్టుకున్న ఫోన్ అందజేత

News November 26, 2024

ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు

image

గుమ్మడూరు మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కృతజ్ఞత పూర్వకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డి.రాజేష్ మాట్లాడుతూ.. ప్రజల కొన్నేళ్ల తపస్సు త్యాగం, సామర్థ్యాల ఫలితమే రాజ్యంగమని, ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

News November 26, 2024

వరంగల్: భారీగా తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పత్తి భారీగా తరలి వచ్చింది. అయితే ధర మాత్రం నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,860 పలకగా.. నేడు రూ.6770కి పడిపోయింది. ధరలు భారీగా పడిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.