News August 25, 2024
విశాఖలో ఆర్మీ ర్యాలీ.. ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

విశాఖ పోర్టు స్టేడియంలో ఈ నెల 26 నుంచి జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి భద్రత ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ శనివారం సాయంత్రం పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తొక్కిసలాటకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5 వరకు జరిగే కార్యక్రమంలో లోటుపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News March 17, 2026
విశాఖ: సరెండర్ తర్వాత భవానీ శంకర్‌కు పోస్టింగ్

విశాఖలో DROగా పనిచేసి సరెండర్ అయిన భవానీ శంకర్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. గతేడాది RDO శ్రీలేఖతో విభేదాల కారణంగా ఇద్దరినీ సరెండర్ చేశారు. అప్పటి నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆయనను కాకినాడ జిల్లా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News March 17, 2026
విశాఖ తీరంలో మృతదేహం కలకలం

విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వైఎంసీఏ బీచ్ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. త్రీటౌన్ సీఐ పైడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని గుర్తించిన వారు వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
News March 17, 2026
విశాఖ: ఒకే వేదికపై ప్రత్యర్థులు

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఎన్నికల్లో పరస్పర విమర్శలతో హోరెత్తించిన గంటా, అవంతి శ్రీనివాసరావు ఈ వేడుకలో చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.


