News August 25, 2024
అశ్వారావుపేటలో తాచుపాము కలకలం

కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రహదారిలో మల్లికార్జునరావు ఇంట్లో తాచుపాము కలకలం సృష్టించింది. వంట గదిలో పాము ఉండటంతో ఇంట్లో వారు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అది అక్కడే ఉండటంతో స్థానికులు అటవీశాఖ FBO సురేశ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన పాములు పట్టే వ్యక్తి ప్రదీప్‌ను పిలిపించి దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Similar News
News March 10, 2026
ఖమ్మంలో తెల్లవారుజామున కవిత అరెస్టు

ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం అంబేడ్కర్ భవన్ వద్ద డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి ఆమె దీక్షకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ వైపు తరలించారు. పోలీసులకు, బాధితులకు మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
News March 10, 2026
నేటి నుంచి పశువులకు గాలికుంటు టీకాలు

ఖమ్మం జిల్లావ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి పురందర్ తెలిపారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించి మూడు నెలలు దాటిన గేదె, గోజాతి పశువులకు టీకాలు వేస్తాయని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులను రక్షించుకోవాలని ఆయన కోరారు.
News March 10, 2026
నిర్వాసితులకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి

ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వారికి ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. క్రషర్ వివాదంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అసత్య ప్రచారాలు చేసే వారికి అసెంబ్లీ సాక్షిగా గట్టి సమాధానం చెబుతానని మంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


