News August 25, 2024

కొత్త జీపీగా తాట్‌పల్లి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో నూతనంగా తాట్‌పల్లి గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేస్తూ శనివారం గెజిట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో ఇప్పటి వరకు 37 గ్రామ పంచాయతీలు ఉండగా తాజాగా వాటి సంఖ్య 38కి చేరి జిల్లాలోనే న్యాల్‌కల్‌ అతిపెద్ద మండలంగా అవతరించింది.

Similar News

News March 7, 2026

పోలీసులు భాగస్వాములు కావాలి: మెదక్ అదనపు ఎస్పీ

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పోలీసులు భాగస్వాములు కావాలని అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు సురక్షితంగా చేరుకోండి (Arrive Alive) కార్యక్రమం హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల అమలు, హెల్మెట్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.

News March 7, 2026

మెదక్: పరేడ్‌ పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

image

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌లో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ పాల్గొని, పోలీసు సిబ్బంది అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై సూచనలు చేశారు. పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు సిబ్బంది మధ్య సమన్వయం (కోఆర్డినేషన్) పెరుగుతుందని తెలిపారు.

News March 7, 2026

MDK: నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య

image

మెదక్ జిల్లా తూప్రాన్‌కి చెందిన తాపీ మేస్త్రి తిమ్మాపురం సత్యనారాయణ (55) అనారోగ్యం కారణంగా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగ్గా, ఇటీవల పక్షవాతం (పెరాలసిస్) బారిన పడ్డారు. శారీరక ఇబ్బందులతో నొప్పి తట్టుకోలేక శనివారం ఇంట్లో ఉరివేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.