News August 25, 2024

దేశవ్యాప్తంగా 768 బీజేపీ కార్యాలయాల ఏర్పాటు: నడ్డా

image

దేశవ్యాప్తంగా 768 బీజేపీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. గోవాలోని పార్టీ ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. వీటిలో ఇప్పటికే 563 సిద్ధమవ్వగా, మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. 2013లో జరిగిన గోవా సమావేశంతోనే బీజేపీ విజయాల బాట పట్టిందని ఆయన గుర్తు చేశారు.

Similar News

News April 8, 2026

ప్రియుడితో నటి బ్రేకప్!

image

‘దంగల్’ నటి సాన్యా మల్హోత్రా ప్రియుడికి బ్రేకప్ చెప్పినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. సితారిస్ట్ రిషబ్ రిఖిరామ్‌తో ఏడాదిగా ఆమె డేటింగ్‌ చేస్తున్నారు. విడిపోవాలని నిర్ణయించుకున్న వారిద్దరూ తాజాగా SMలో అన్‌ఫాలో చేసుకున్నారు. రిషబ్ మరో యువతితో డేటింగ్‌లో ఉండటమే ఇందుకు కారణమని టాక్. ఇక సాన్యా మల్హోత్రా.. బదాయ్ హో, జవాన్, థగ్ లైఫ్, బేబీ జాన్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.

News April 8, 2026

మావిగన్‌పై మంత్రి లోకేశ్ సెటైరికల్ ట్వీట్

image

AP: రాష్ట్ర రాజధానిగా వైసీపీ చీఫ్ జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై మంత్రి లోకేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. మా..య, వి..ధ్వంసం, గన్..దరగోళం/గన్.. కల్చర్ అంటూ పేర్కొన్నారు. ఇదేనా జగన్ మీ ప్లాన్ B అంటూ ఓ ఫొటో రిలీజ్ చేశారు. మావిగన్ అంశంపై కూటమి, వైసీపీ నేతలు కొన్ని రోజులుగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

News April 8, 2026

రేపు జీవన్ రెడ్డిని కలవనున్న KTR

image

TG: అంతర్గత కుమ్ములాటలతో ఇటీవల కాంగ్రెస్‌ను <<19472372>>వీడిన<<>> సీనియర్ నేత జీవన్ రెడ్డిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రేపు కలవనున్నారు. జగిత్యాల వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈనెల 13న KCR సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే MLA సంజయ్ BRS నుంచి INCలో చేరగా, కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి BRSలోకి వెళ్లనున్నారు. దీంతో జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.