News August 25, 2024

ఆదిలాబాద్: మేనల్లుడని చేరదీస్తే ఇంట్లోంచి వెల్లగొట్టాడు

image

మేనల్లుడని చేరదీస్తే తమను సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆదిలాబాద్‌‌లోని శాంతినగర్‌కు చెందిన దేవన్న, దేవమ్మ దంపతులు వాపోయారు. తాను గతంలో మేస్త్రీ పని చేసే వాడినని, ఓ ప్రమాదంలో కాలుకోల్పోయి ఇంటికే పరిమితమయ్యానని దేవన్న పేర్కొన్నారు. దీంతో చేరదీసిన మేనల్లుడు తమను ఇంట్లోంచి వెల్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై RDOను కలిసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లగా ఆయన రాకపోవడంతో వెనుదిరిగామన్నారు.

Similar News

News January 15, 2025

బెజ్జూర్: తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య

image

బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన కావిడె నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తండ్రి దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు పై ఎస్సై ప్రవీణ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు నవీన్‌ను మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు..

News January 15, 2025

జాతీయస్థాయి పరీక్షలో నార్మూర్ అమ్మాయి ప్రతిభ

image

నేషనల్ మెటీరియాలజీ ఒలంపియాడ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సోంకామ్లే సోని ప్రతిభ చాటింది. పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. దిల్లీలో శాస్త్రవేత్తల చేతులమీదుగా అవార్డును అందుకుంది..

News January 15, 2025

NRML: శిశువు మృతదేహం లభ్యంపై దర్యాప్తు

image

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. SI శ్రీకాంత్ కథనం ప్రకారం.. అప్పుడే పుట్టిన మగ శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శిశువుకు 5 నుంచి 6 నెలల వయసు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.