News August 25, 2024

కదిరిలో వ్యభిచారం.. ఇద్దరు మహిళల అరెస్టు

image

కదిరిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు మహిళలు న్యూఅమీన్ నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని, ఇతర ప్రాంతం నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రణాళిక ప్రకారం దాడి చేసి అరెస్టు చేశామన్నారు.

Similar News

News March 27, 2026

అనంతపురంలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ

image

అనంతపురం రూడ్ సెట్ సంస్థలో వచ్చే నెల 2 నుంచి 30 రోజుల పాటు నిరుద్యోగ పురుషులకు ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. 18-50 ఏళ్ల లోపు గ్రామీణ నిరుద్యోగ యువకులు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అనంతపురం రూడ్ సెట్ కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.

News March 26, 2026

గర్భస్థ లింగ నిర్ధారణపై కలెక్టర్ హెచ్చరిక

image

అనంతపురంలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఓ.ఆనంద్ హెచ్చరించారు. పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్షిస్తూ స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.