News August 25, 2024

BREAKING.. నల్గొండ: తల్లిని హత్య చేసి.. కుమారుడి సూసైడ్

image

నల్గొండ జిల్లా నిడమానూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ కుమారుడు తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి సాయమ్మను కత్తితో పొడిచి అనంతరం శివ గొంతుకోసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాలతో తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Similar News

News March 31, 2026

నల్గొండ: పన్ను కట్టలేదని 20 షాపులు సీజ్.. నేడే ఆఖరు

image

నల్గొండ నగరంలో ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు చెందిన 20 షాపులను సోమవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు యజమానులు పన్ను కట్టారు. కాగా, ఆస్తి పన్ను చెల్లింపునకు నేడే (మార్చి 31) ఆఖరు. గడువులోగా చెల్లించకుంటే అర్ధరాత్రి నుంచి ఆటోమెటిక్ గా అపరాధ రుసుము పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఆ వడ్డీని తగ్గించే అధికారం తమకు ఉండదని వారు హెచ్చరించారు.

News March 31, 2026

నల్గొండ: 3 నెలల రేషన్ బియ్యం.. రేపట్నుంచే

image

నల్గొండ జిల్లాలో రేపటి నుంచి లబ్ధిదారులకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని ఇవ్వనున్నారు. జిల్లాలో 5.27లక్షల కార్డులుండగా, ఇందుకోసం 22,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. మొత్తం 1,051 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ కోసం ఇప్పటికే బియ్యం స్టాక్ ఆయా షాపులకు తరలుతున్నాయి.

News March 31, 2026

నల్గొండ: ఏప్రిల్ 1 నుంచి ‘ఈ- ఆఫీస్’ తప్పనిసరి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏప్రిల్ 1 నుంచి దస్త్రాల నిర్వహణను పూర్తిగా ‘ఈ- ఆఫీస్’ విధానం ద్వారానే చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి దీనిపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామని ఆయన తెలిపారు. ఇకపై భౌతిక దస్త్రాలకు స్వస్తి పలికి, డిజిటల్ పద్ధతిలో పారదర్శకతతో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.