News August 25, 2024
HYD: వినాయకచవితికి పటిష్ట చర్యలు: సీపీ

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూడు కమిషనరేట్స్ పరిధిలోని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ్ సమితి, ఖైరతాబాద్ ఉత్సవ్ సమితి, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు.
Similar News
News September 13, 2025
HYD: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.
News September 13, 2025
గాంధీలో ఉత్తమ సేవలకు సహకారం: జూడాలు

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణిని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆసుపత్రి సేవల మెరుగుదలకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే జూనియర్ వైద్యుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో జూడా అధ్యక్షుడు డా.అజయ్‌కుమార్ గౌడ్ సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
News September 13, 2025
HYD: మెట్రో నిర్వహణలో అసలేంటి L&Tకి సమస్య

L&T ఆధ్వర్యంలో సిటీలో 2017లో మెట్రో ప్రారంభమైంది. ఆ రోజుకు కంపెనీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం రూ.3,756 కోట్లు. అయితే ఇంతవరకు ఆ మొత్తం సర్కారు చెల్లించలేదు. దీంతో ఆ మొత్తం వడ్డీతో కలిపి 2020 నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తంతోపాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన వయబిలిటీ ఫండ్ రూ.254 కోట్లూ ఇవ్వలేదు. దీంతోతాము ఇక నడపలేమని L&T చెబుతోంది.