News August 25, 2024
ఈ నెల 27 నుంచి విద్యార్థులకు పరీక్షలు

స్కూలు విద్యార్థులకు సెల్స్ అసెస్‌మెంట్ (ఎస్ఏ) పరీక్షలను ఈ నెల 27 నుంచి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 1-8వ తరగతి వరకు విద్యార్థులకు తరగతి గది (CBA) మూల్యాంకన విధానంలో, 9, 10 తరగతులకు రెగ్యులర్ పద్ధతిలో నాన్ సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. తూ.గో జిల్లాలో 980, కాకినాడ జిల్లాలో 1258, కోనసీమ జిల్లాలో 1574 పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Similar News
News August 23, 2025
దేవరపల్లి: లారీ ఢీకొని సర్పంచ్ బుల్లారావు మృతి

దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదర మండలం రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బుల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లారావు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News August 23, 2025
రాజమండ్రి: వీడిన మర్డర్ మిస్టరీ.. ఐదుగురి అరెస్ట్

ధవళేశ్వరానికి చెందిన వేపాడ సతీశ్ (23) హత్య కేసు మిస్టరీ వీడింది. టూ టౌన్ సీఐ శివ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న కైలాస భూమి శ్మశాన వాటిక సమీపంలో మద్యం తాగుతుండగా ఓ వ్యక్తిగత వ్యవహారంపై జరిగిన గొడవలో బి. రాధాకాంత్‌తో పాటు నలుగురు కలిసి సతీశ్‌ను కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశారు. అనుమానాస్పద కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురి అరెస్టు చేశారు.
News August 23, 2025
గణేశ్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. అయితే, ఈ అనుమతుల కోసం ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిబంధనలను ఆయన శుక్రవారం ప్రకటించారు. విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.