News August 25, 2024
శ్రీకాళహస్తి: ఇలాంటి విషయాల్లో జాగ్రత్త..!

అతని వయస్సు పాతికేళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు. పెడదారి పట్టి చివరకు చనిపోయాడు. శ్రీకాళహస్తి సీఐ గోపి వివరాల మేరకు.. తెలంగాణ(S) సిద్ధిపేట(D) గజ్వేల్‌కు చెందిన శివ(26) పెయింటర్. ఆరేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో 2 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమె మందలించగా.. బెదిరించేందుకు పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Similar News
News March 27, 2026
చిత్తూరు: చెస్ ఆడుతారా..?

ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జిల్లాస్థాయి చెస్ పోటీలు జరగనున్నాయి. చిత్తూరులో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు www.apchess.org వెబ్‌సైట్ ద్వారా ఈనెల 29వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన ఇద్దరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.
News March 26, 2026
గంగవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గంగవరం మండలం, మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. మేలుమాయి క్రాస్‌కు చెందిన దొరస్వామి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు మరో బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 26, 2026
చిత్తూరు: విస్తృత భద్రత ఏర్పాట్లు

శ్రీరామనవమి పురస్కరించుకొని దేవాలయాలు, ముఖ్య ప్రదేశాలు, శోభాయాత్రలు నిర్వహించే ప్రాంతాలలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని.. ఏ సమస్య వచ్చిన పోలీసులను సంప్రదించాలని కోరారు.


