News August 25, 2024
225 విల్లాలకు నోటీసులు

TG: హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో 658కి విరుద్ధంగా 225 ROW హౌసులు నిర్మించారని, జీ+1కి పర్మిషన్ తీసుకుని జీ+2 కట్టారని పేర్కొన్నారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి రూ.50 కోట్ల నష్టం జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
Similar News
News March 18, 2026
నేడు అకౌంట్లలోకి డబ్బులు

AP: పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో నేడు ప్రభుత్వం రూ.250 కోట్లు జమ చేయనుంది. ఉగాది కానుకగా CM చంద్రబాబు ఇవాళ కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నారు. వీరికి గతేడాది సంక్రాంతికి రూ.980 కోట్లు, దీపావళికి రూ.1,000 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016లో తాము రూ.700 కోట్లు ఇవ్వగా.. YCP హయాంలో ఒక్క రూపాయీ చెల్లించలేదని ఆరోపిస్తోంది.
News March 18, 2026
SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషనే ఎందుకు?

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్, నాయకత్వ లక్షణాల వల్లే అతడి వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపిందని సమాచారం. ఝార్ఖండ్ జట్టుకు తొలిసారి SMAT ట్రోఫీ అందించడంతోపాటు అద్భుత ఆటతో భారత జట్టులోకి ఇషాన్ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో బ్యాటింగ్‌లో తడబడుతున్న అభిషేక్‌తో పోలిస్తే ఇషాన్‌ను SRH ఫస్ట్ ఛాయిస్‌గా చూసినట్లు టాక్. మీరేమంటారు?
News March 18, 2026
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్‌లు ఇలా తీసుకోండి!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకానికి అమరావతిలో CM CBN శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గాల్లో MLAలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్‌పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ పొందొచ్చు. ఈ స్కీమ్‌తో రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలగనుంది.


