News August 25, 2024
ఏలూరు జిల్లాలో YSR విగ్రహం ధ్వంసం

ఏలూరు జిల్లాలో YSR విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెం గ్రామంలో YSR విగ్రహాన్ని శనివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఇవాళ ఉదయాన్నే ఈ ఘటనను గుర్తించారు. ఎంపీటీసీ బిరుదుగట్ల రత్నకుమారి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News January 19, 2026
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News January 18, 2026
బధిరుల క్రీడల్లో ‘పశ్చిమ’ ప్రభంజనం.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

హర్యానాలో జరిగిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడా పోటీల్లో ప.గో. జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించారని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 600 మంది పాల్గొన్న ఈపోటీల్లో, జిల్లా నుంచి వెళ్లిన 16 మంది ప్రతిభ కనబరిచారన్నారు. విజేతలను ఆదివారం భీమవరంలో ఘనంగా అభినందించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణించడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.