News August 25, 2024
వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి: పొంగులేటి

TG: వరంగల్ మహా నగర అభివృద్ధికి తక్షణమే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షించారు. HYD తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లో అభివృద్ధి విస్తరణకు 2050 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని సూచించారు. అవసరమైన భూసేకరణను కూడా చేపట్టాలన్నారు.
Similar News
News January 7, 2026
జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు – కలుపు నివారణ

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగులో కలుపు నివారణకు మొదటి 20- 25 రోజులు కీలక దశ. వరికొయ్యలపై పొద్దుతిరుగుడు విత్తిన రోజు ముందుగా లీటరు నీటికి పారక్వాట్ కలుపు మందు 5mlను కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటలలోపు తేమ గల నేలపై పెండిమిథాలిన్ కలుపు మందును లీటరు నీటికి 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో లీటరు నీటికి క్విజాలోఫోప్ ఈథైల్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
News January 7, 2026
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4,6,4,6

సౌతాఫ్రికా U-19తో మూడో వన్డేలో భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయారు. 7వ ఓవర్లో వరుసగా 4,6,4,6 బౌండరీలు బాదారు. ఈక్రమంలోనే అతడు 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుతం వైభవ్(56)తో పాటు ఆరోన్ జార్జ్(51) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 111 రన్స్ జోడించారు.
News January 7, 2026
బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్ రీషఫుల్?

బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిలో భాగంగా పలువురు మంత్రులను తొలగిస్తారని సమాచారం. ముఖ్యంగా మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని భావిస్తున్నారు. వారి స్థానంలో పార్టీ సీనియర్లు, సంఘ్ సన్నిహితులకు చోటు లభిస్తుందని చెబుతున్నారు. కాగా EX బ్యూరోక్రాట్స్ అయిన జైశంకర్, హర్దీప్, అర్జున్ రాం, అశ్వినీ వైష్ణవ్ ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు.


