News August 25, 2024

భువనగిరి: ఈనెల 27, 29న జిల్లాలో గవర్నర్ పర్యటన

image

భువనగిరి జిల్లాలో ఈ నెల 27, 29న రాష్ట్ర గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. 29న రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ శర్మ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటారని, అనంతరం 29న జైన దేవాలయాన్ని, సోమేశ్వర ఆలయాన్ని, స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.

Similar News

News September 29, 2024

చెన్నారం గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బుగ్గ తండాకు చెందిన భీముడు (23), రమేష్(8)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

NLG: ఎటు చూసినా ధరల మోతే

image

నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు ముండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోత మోగుతుంది. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.40 నుంచి రూ.60 పలుకుతోంది. జిల్లాలో రైతులు కూరగాయల సాగు వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో కూరగాయలను ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News September 29, 2024

NLG: నల్గొండకు కావాలి హైడ్రా!

image

నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా అక్రమార్కుల్లో భయం కనిపించడం లేదు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అధికారులు వీటిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.