News August 25, 2024
పాకిస్థాన్‌లో ‘కల్కి’ ట్రెండింగ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. వీకెండ్ కావడంతో ‘కల్కి’ని టీవీల్లో చూసేందుకు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్-3లో ట్రెండ్ అవుతోంది. అయితే, పాకిస్థాన్‌లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం నంబర్1లో ట్రెండ్ అవుతుండగా ఖతర్‌లో మూడో ప్లేస్‌లో కొనసాగుతోంది.
Similar News
News January 9, 2026
KNR: స్కూళ్లలో ‘ఫిర్యాదుల పెట్టె’.. వేధింపులకు ఇక చెక్!

పాఠశాల విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన ‘ఫిర్యాదుల పెట్టె’ ఆలోచన ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొమ్మకల్ హైస్కూల్లో ఈ పెట్టెను ఆమె స్వయంగా పరిశీలించారు. వేధింపులు, సమస్యలు ఎదురైతే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పోలీసుల పర్యవేక్షణలో వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. కలెక్టర్ అద్భుతమైన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News January 9, 2026
ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
News January 9, 2026
రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.


