News August 25, 2024

312 ప్రభుత్వ ఉద్యోగాలు.. APPLY చేసుకోండి!

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆగస్టు 26 రాత్రి 11 గంటల్లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వయసు 18-30 ఏళ్లు. పే స్కేల్ రూ.35,400-రూ.1,12,400గా ఉంది. మొత్తం 312 జూనియర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులున్నాయి. ఇంగ్లిష్, హిందీలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. <>సైట్<<>>: https://ssc.gov.in/

Similar News

News March 5, 2026

భర్త జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి ₹25Kను నేరుగా భార్య ఖాతాలో జమ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన చట్టపరమైన హక్కు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

News March 5, 2026

సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

image

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.

News March 5, 2026

3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

image

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.