News August 25, 2024
వచ్చే నెల మొదటి వారంలో సాగర్ నీళ్లు విడుదల: కలెక్టర్

జిల్లాలో సాగుకు సాగర్ నీటిని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కేటాయింపుల ఆధారంగా నీటి పంపిణీ జరుగుతుందన్నారు. సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆమె కోరారు.
Similar News
News March 20, 2026
రేపు మార్కాపురంలో జాబ్ మేళా

మార్కాపురంలోని జార్జి ఫార్మసీ కళాశాలలో రేపు జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. B. Pharmacy, M. Pharmacy, B.Sc, M.Sc, B.Tech విద్యార్హతలు కలిగిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, పాస్ ఫోటోలు అలాగే జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News March 20, 2026
ప్రకాశం: కారు ధ్వంసం.. చంపుతామని బెదిరింపులు

ఒంగోలుకు చెందిన పవన్ కుమార్ కారును గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన చిన్నగంజాం మండలంలోని కడవకుదురు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. సొపిరాలకి చెందిన కోటేశ్వరరావు, సన్నీ, వాసు మరికొంతమంది కలిసి పవన్ కుమార్ కారును ధ్వంసం చేశారు. అనంతరం చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు SI చెప్పారు.
News March 20, 2026
ప్రకాశం: అనారోగ్యంతో పోలీస్ జాగిలం మృతి

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9 ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. దీంతో SP హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.


