News August 25, 2024

OTTలోకి సూపర్ హిట్ సినిమా

image

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన హారర్ కామెడీ సినిమా ‘ముంజ్య’ హాట్‌స్టార్‌లో విడుదలైంది. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ మూవీ రూ.135 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘బడ్డీ’ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.

Similar News

News January 23, 2026

జగన్ ఖాతాకు శ్రీలంక VPN.. ‘X’ ఏం చెబుతోందంటే?

image

AP: వైసీపీ అధినేత జగన్ తన ‘X(ట్విటర్)’ ఖాతాకు శ్రీలంక VPN(వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌) వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన హ్యాండిల్‌లో ‘Account based in Sri Lanka’ అని చూపిస్తోందని నెటిజన్లు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. అయితే ఈ డేటా కచ్చితమైనది కాకపోవచ్చని, ఇంటర్నెట్ ప్రొవైడర్లు యూజర్లకు తెలియకుండానే VPN వంటి ప్రాక్సీలను ఉపయోగించవచ్చని ‘X’ చెబుతోంది.

News January 23, 2026

రెండు వారాల్లో గ్రీన్‌లాండ్‌పై క్లారిటీ: ట్రంప్

image

గ్రీన్‌లాండ్‌ డీల్ విషయంలో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని.. మరో 2 వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతకొన్ని వారాలుగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ ఆయన హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ దశలో సైనిక చర్యకూ వెనకాడబోమని హెచ్చరించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గారు.

News January 23, 2026

రేషన్ బియ్యంతోపాటు నిత్యావసరాలు: ఉత్తమ్

image

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్‌లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.