News August 25, 2024
18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. 43.94 ఎకరాలు స్వాధీనం: హైడ్రా
TG: ఇప్పటివరకు HYDలోని 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు ప్రభుత్వానికి ‘హైడ్రా’ నివేదిక ఇచ్చింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నాగార్జునకు చెందిన N కన్వెన్షన్, ప్రో కబడ్డీ ఓనర్ అనుపమ, మంథని BJP MLA అభ్యర్థి సునీల్‌రెడ్డి, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్‌రావు, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడు ఆనంద్‌తో సహా పలువురికి చెందిన నిర్మాణాలను కూల్చినట్లు పేర్కొంది.
Similar News
News January 15, 2025
ఒక్కరోజులో 5626% పెరిగిన ట్రంప్ కాయిన్!
US ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఒక క్రిప్టో కాయిన్ ఉందని తెలుసా! దానిపేరు First Crypto President. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ DTC మార్కెట్ విలువ $141.5M. మొత్తం సప్లై వంద కోట్ల కాయిన్లు. గత 24 గంటల్లో ఇది ఏకంగా 5626% పెరిగింది. $0.0003321 నుంచి $0.01800కు చేరుకుంది. భారత కరెన్సీలో ఇప్పుడు రూ.1.53 పలుకుతోంది. MAGA, WLFI, $POTUS, $DJT సైతం ట్రంప్‌తో సంబంధం ఉన్నవే.
News January 15, 2025
సంక్రాంతి మూవీస్: ఏ సినిమా బాగుంది?
ఈ సారి సంక్రాంతికి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, 14న వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో ఈ సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మీరు ఏ సినిమా చూశారు? ఏ సినిమా బాగుందో కామెంట్ చేయండి?
News January 15, 2025
ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు BIG షాక్
నామినేషన్లకు ముందు ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్! లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ను విచారించేందుకు EDకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులను విచారించే ముందు ED అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు నవంబర్లో సూచించిన సంగతి తెలిసిందే. కాగా తనపై తప్పుడు ఛార్జిషీటు దాఖలు చేశారని కేజ్రీ ఆరోపిస్తున్నారు.