News August 25, 2024
రణస్థలం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రణస్థలం మండలం బంటుపల్లి జంక్షన్ సమీపంలో బీరు ఫ్యాక్టరీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. పైడి భీమవరం నుంచి రణస్థలం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. వీరి ఇరువురు తండ్రి కొడుకులుగా స్థానికులు భావిస్తున్నారు. మృతులు విజయనగరం జిల్లా రేగడి ఆమదాలవలస మండలానికి చెందిన వారని సమాచారం.
Similar News
News April 3, 2026
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సిక్కోలు మహిళ

టెక్కలి సైనిక్ నగర్‌కు చెందిన మార్పు సాయి సృజన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. తాజాగా గురువారం విడుదల అయిన ఫలితాల్లో ఈమె ఎంపికయ్యారు. టెక్కలిలో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తిచేసిన ఈమె విజయవాడలో ఇంటర్ చదివారు. హైదరాబాద్ ఎన్టీఆర్ కళాశాలలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీలో బీఎల్ చేశారు. ఈమె తండ్రి నారాయణమూర్తి ఆంగ్ల ఉపాధ్యాయులు కాగా, తల్లి గృహిణి. ఈమె ఎంపిక పట్ల పలువురు అభినందించారు.
News April 3, 2026
శ్రీకాకుళం: ‘నిబంధనల మేరకు ఎగ్జామినర్లను నియమించాలి’

పదో తరగతి మూల్యంకనం ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్పాట్ వాల్యేయేషన్ నిబంధనల మేరకు ఎగ్జామినర్ల నియమించాలని డీటీఎఫ్ నాయకులు కృష్ణారావు, హరి ప్రసన్న అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఉపాధ్యాయ సంఘ సమన్వయ కమిటీలో విద్యాశాఖ అధికారి రవిబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. సబ్జెక్ట్ డీల్ చేయని వారిని ఎగ్జామినర్ల నియామకం సరికాదన్నారు.
News April 3, 2026
శ్రీకాకుళం: స్పాట్ వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు

ఈనెల ఆరవ తేదీన పదో తరగతి జవాబు పత్రాల స్పాట్ మూల్యంకనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణ్, డీఈవో రవి బాబు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ యూనియన్ నాయకులతో సమావేశం జరిగింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎగ్జామినర్ల నియామకం ఉంటుందని చెప్పారు. మూల్యాంకన కేంద్రం వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లను చేస్తున్నట్లు వెల్లడించారు.


