News August 25, 2024
చేబ్రోలు కోట్లమ్మ జాతరలో ఏలూరు ఎంపీ

ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామదేవత కోట్లమ్మ 72వ జాతర మహోత్సవంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులుతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ మేరకు జాతర కమిటీ నిర్వాహకులు తొలుత ఆలయ మర్యాదలతో ఎంపీ మహేష్‌ను స్వాగతించారు. అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News March 15, 2026
ప.గో: బండిపై వెళ్తుంటే భార్య గొంతు కోశాడు.. అసలేం జరిగింది?

భార్య గొంతు కోసిన భర్తను తణుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం సజ్జాపురానికి చెందిన కరగాని దిల్లేశ్వరి బండిపై వెళ్తుండగా, వెనుక కూర్చున్న భర్త గోవిందు బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మనస్పర్ధల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గోవిందును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తీవ్ర గాయాలైన దిల్లేశ్వరికి చికిత్స అందుతోంది.
News March 15, 2026
హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ.. పాల్గొన్న ఏలూరు ఎంపీ!

HYD మొయినాబాద్‌లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో శనివారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంలో పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో పార్టీలోని ఒకరు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న 9 మందిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఉన్నారు. ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. రోహిత్ సహా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.