News August 25, 2024

ఎర్రగుంట్లకు తెలుగు భాషకు ఉన్న అనుబంధం ఇదే.!

image

ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని, కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదివారం అధికారులకు సూచించారు. తెలుగు భాష ప్రారంభానికి చిహ్నమైన తొలి తెలుగు శాసనం ఎర్రగుంట్ల మండలం కలమల్లలో క్రీస్తుశకం 575వ సంవత్సరంలో రేనాటి చోళ రాజు ధనుంజయ వర్మ వేయించారని, అక్కడ తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ప్రతిష్ఠాత్మకమని తెలిపారు.

Similar News

News March 12, 2026

రేపు కడపకు రానున్న గవర్నర్

image

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 13న కడపకు రానున్నారు. YVU జరగనున్న స్నాతకోత్సవానికి ఆయన ఛాన్స్‌లర్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి కార్యక్రమం జరిగే వేదిక చేరుకొంటారు. అనంతరం తిరిగి ఆయన విజయవాడకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 12, 2026

గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కడప ఎస్పీ

image

వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇచ్చి వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపించి మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అధికారిక గ్యాస్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

News March 12, 2026

కడపలో రైతులకు రైతులే మార్గదర్శకులు: కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ రంగంలో వినూత్నంగా అమలు చేస్తున్న “ఛాంపియన్ రైతుల ఎంపిక విధానం” గురించి కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 361 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రతి గ్రామంలో ఎక్కువగా పండించే పంటలో నైపుణ్యం కలిగిన 361 మంది రైతులను ఆదర్శ రైతులుగా (ఛాంపియన్లు) గుర్తించినట్లు తెలిపారు. రైతులకు పంటల సాగు విధానలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.